హీరో విక్రమ్ ప్రభు 26వ చిత్రం 'సిటీ ఆఫ్ గోల్డ్'. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. శివాత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, అమలా షాజీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. ఫస్ట్ లుక్‌లో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్స్ లుక్‌తో కూర్చుని.. చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను పైకి విసురుతూ పట్టుకుంటూ కనిపించారు. బంగారం విలువతో పాటు దాని చుట్టూ ఉన్న మిస్టీరియస్ ప్రపంచాన్ని కలిపి చూపించిన ఈ విజువల్ ఆసక్తిని పెంచుతోంది. గ్లింప్స్ ప్రేక్షకులను మరింత ఆసక్తికరమైన ప్రపంచం లోకి తీసుకెళ్తుంది. బంగారం మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తులు, సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని ఒక రహస్య వ్యవస్థను ఇందులో చూపించారు. ఆకట్టుకునే విజువల్స్ ద్వారా సినిమా నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేయడం క్యురియాసిటీ పెంచింది. కోయంబత్తూర్, చెన్నై, కేరళలో ఈ సినిమాను విస్తృతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయి. ‘డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ విజువల్స్, టాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూతో రూపొందుతున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు కెరీర్‌లో మరో ఆసక్తికరమైన సినిమా అవుతుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు.
యూనిక్‌గా 'సిటీ ఆఫ్ గోల్డ్'
50 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)