Magazines

ఇలాంటి కథ వినలే

44 నిమిషాల క్రితం

story
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

దు ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం హీరో ఫ‌హాద్ ఫాజిల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా చేయటానికి కారణం? - కార్తికేయ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కథ గురించి చెప్పారు. శశాంక్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా జీవితంలో అసలు ఇలాంటి ఓ కథను వినలేదు. అందుకే ఈ సినిమాని చేయాలని ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని మెప్పించిన అంశాలు ఏమిటి? - ఈ చిత్రంలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధం వంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే మ్యాజిక్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో లోతైన అంశాలు, భావోద్వేగాలెన్నో ఉన్నాయి. చాలా మందికి చాలా విషయాల్ని అర్థమయ్యేలా చెప్పే చిత్రం అవుతుంది. చిన్న‌పాప సారాతో న‌టించ‌టం ఎలా అనిపించింది? - సారా అద్భుతమైన నటి. కెమెరా ముందు ఎంతో ఆర్గానిక్‌గా నటిస్తుంది. పేపర్ మీద ఉన్న దాని కంటే ఎక్కువగా ఇంప్రవైజ్ చేస్తుంది. ఎంతో యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా యాక్ట్ చేసింది. మీ పాత్రలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? - నేను చేసే ప్రతీ పనిలో నా బెస్ట్ ఇవ్వాలని, నా వర్క్ పట్ల నిజాయతీగా ఉండాలని అనుకుంటాను. ఇందులోని నా పాత్ర అద్భుతంగా ఉంటుంది.

నా క్యారెక్టర్‌లోని జర్నీ కొత్తగా ఉంటుంది. చెడు నుంచి మంచిగా మారే ఆ జర్నీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నా పాత్రకు నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను. కాలభైర‌వ సంగీతం గురించి? - కాల భైరవ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఆయన మ్యూజిక్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్‌లా ఉంటుంది. ఆయన బీజీఎం యాడ్ అయ్యాక సినిమా నెక్ట్స్ లెవెల్‌లో అనిపించింది. సూరి పాత్రకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? - సూరి క్యారెక్టర్‌ని ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. నేను నా రియల్ లైఫ్‌లో సూరి పాత్రలా ఉండను. కానీ సూరి లాంటి కారెక్టర్స్‌ని నేను నా జీవితంలో చాలా మందిని చూశాను. ఈ సినిమా చూసి రాజ‌మౌళి ఏమన్నారు? - దర్శకుడు రాజమౌళి మా సినిమాలోని కొన్ని సీన్స్ చూసి సలహాలు ఇచ్చారు. ఫైనల్ ప్రోడక్ట్ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో మాకు సినిమా ఫలితంపై మరింత నమ్మకం పెరిగింది. ఇదే బ్యానర్‌లో మ‌రో సినిమా చేస్తున్నారా? - అవును. వచ్చే ఏడాదిలో ఆ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారు. మీ 24 ఏళ్ళ సినీ ప్రస్థానం ఎలా ఉంది? - ఇంజనీరింగ్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యాను. నా మొదటి సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్‌ సినిమాతో మొదలైన నా జర్నీ ఎన్నో జయాపజయాలను చూస్తూ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు 66 సినిమాలు చేశాను.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్