Magazines

విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి  

59 నిమిషాల క్రితం

college
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఎస్ఆర్ జూనియర్ కళాశాల ఘనంగా స్వాగత కార్యక్రమం

 నవతెలంగాణ-ఆలేరు టౌను  

విద్యార్థులు భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, విజయం పై పట్టు సాధిస్తూ, ఉన్నత శిఖరాలు  అధిరోహించాలని, యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెం సర్పంచ్,  రాష్ట్ర రైతు సంఘం నాయకులు కొల్లూరి రాజయ్య  అన్నారు. ఆలేర్ పట్టణంలో శనివారం ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ కంటం రమేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొల్లూరు రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్ఆర్ కళాశాలలో విద్యా ప్రమాణాలతో పాటు, విద్యార్థుల క్రమశిక్షణ ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, సంఘసేవకార్యక్రమాలు, అలవర్చుకోవాలని ,కళాశాలకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలన్నారు. చదువుపై పట్టు సాధిస్తూ,

 జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంక్ లు సాధించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్, రాష్ట్ర ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు గ్రహీత కమటం రమేష్ మాట్లాడుతూ ఎస్సార్ అంటే సక్సెస్ రిసోర్స్ అని విజయానికి నిధి అని పేర్కొన్నారు.


గత సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అనుభవాలను తీసుకొని ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువ మార్కులు తేవాలని, ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్న విషయాన్ని జాబితాని గుర్తు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆదరించాయి. 

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సింగం అనిల్ కుమార్, అలివేలు, సిద్దిరాజు, శృతి, పద్మారావు, గోపి, సంతోష్, మౌనిక, శిరీష, భాగ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్