- పారఖ్ పరీక్ష ప్రశ్నాపత్రం రూపకల్పనపై కాంప్లెక్స్ హెచ్‌ఎంల సమావేశం
- ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ - అశ్వారావుపేట
స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శనివారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి (ఎంఈఓ) ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ఏర్పాటు, విద్యార్థుల అభ్యాస లోపాల నివారణకు చేపడుతున్న రెమిడియేషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే పారఖ్ పరీక్షల కోసం ప్రశ్నాపత్రాల రూపకల్పనలో అనుసరించాల్సిన విధానాలు, సామర్థ్యాధారిత ప్రశ్నల తయారీపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు.
పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేలా సమన్వయంతో పనిచేయాలని ఎంఈఓ ప్రసాదరావు సూచించారు. సమావేశంలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)