- ఆయిల్ పామ్ రైతులకు నష్టం వాటిల్లే అవకాశం
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ - అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వం వంటనూనె ధరలను అదుపులో ఉంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం మే లక్ష్యంగా సీపీఓ (క్రూడ్ పామాయిల్ - ముడి పామాయిల్ )దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది అని అయితే దీంతో వినియోగం దారులకు ఊరట ఉంటుందో తెలియదు కాని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళనకు దారి తీసింది అని తెలంగాణ పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు.దిగుమతి నూనె తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే, దేశీయ పామాయిల్ ధరలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
* దిగుమతి ముడి పామాయిల్ తక్కువ ధరకే లభిస్తే దేశీయ మార్కెట్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
* ఫ్యాక్టరీలు ఎఫ్ఎఫ్బీ ( తాజా పండ్ల గెలల ) కొనుగోలు ధరలపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు.
* నాలుగైదేళ్ల పాటు పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చే ఆయిల్ పామ్ రైతుల ఆదాయంపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
* కేంద్రం అమలు చేస్తున్న ఎన్ఎంఈఓ - ఓపీ(జాతీయ వంటనూనెల మిషన్ - ఆయిల్ పామ్ )లక్ష్యాలపై కూడా ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అశ్వారావుపేట,దమ్మపేట, ములకలపల్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. ఈ ప్రాంత రైతులు ఇప్పటికే ఓఈఆర్, ధరల నిర్ణయం, చెల్లింపుల అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తాజా సుంకం తగ్గింపు మరో భారం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైతు సంఘాల ప్రధాన డిమాండ్లు:
* ఎఫ్ఎఫ్బీ ధరలకు రక్షణ కల్పించాలి.
* ఓఈఆర్ ఆధారిత ధరల విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలి.
* దిగుమతి విధానాలతో దేశీయ ఆయిల్ పామ్ రైతులకు నష్టం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
* ఎన్ఎంఈఓ - ఓపీ కింద హామీ ధర, కొనుగోలు భద్రతను మరింత బలోపేతం చేయాలి.







కామెంట్‌లు (0)