Magazines

బాలుడి చికిత్సకు 'మిస్ట్' విద్యార్థులు ఆర్థిక చేయూత

38 నిమిషాల క్రితం

help
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

- ​విరాళాలుగా సేకరించిన  రూ. 26 వేలు అందజేత

​నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి పట్టణానికి చెందిన కొరకొప్పు చార్లెస్ అనే బాలుడు గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. బాధిత బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో మదర్ థెరెసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు ఆ కళాశాలలో విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. సేకరించిన రూ. 26 వేలు విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ సమక్షంలో బాలుడి తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు.

​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో అనుకోని సంఘటనలు లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో సాయం అందించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో మదర్ థెరెసా విద్యా సంస్థల మేనేజ్‌మెంట్, అధ్యాపక బృందం, విద్యార్థులు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడం సామాజిక బాధ్యతగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, సీఎస్‌సీ విభాగాధిపతి పి. మారేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె. రామకృష్ణారెడ్డి, ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పంతంగి మురళీకృష్ణ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్