Magazines

గ్రోమోర్‌ దుకాణాలను వెంటనే సీజ్‌ చేయాలి

1 గంట క్రితం

Gromor Shops
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ఆలేరు పట్టణంలో విత్తనాలు ఎరువుల అమ్మకాలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. అయినప్పటికీ పట్టణంలోని గ్రోమోర్లో గత కొంతకాలంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని రైతుల నుండి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలోని పలు ఎరువుల డీలర్ షాపులను, ఇంటర్నల్ ఫర్టిలైజర్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ నక్కిలి విత్తనాల కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఫర్టిలైజర్ మిక్చర్స్ ఏమైనా అమ్ముతున్నారా అనే విమర్శలు ఊపందుకున్నాయి. తరచుగా తనిఖీలు చేసినా గ్రోమోర్ లోని నకిలీ విత్తనాలు ఎందుకు కనిపెట్టలేకపోయారని అధికారులను రైతులు నిలదీస్తున్నారు.

స్టాక్ రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నామనే చెప్పే అధికారులారా నకిలీ విత్తనాలను ఎందుకు అరికట్టడం లేదని ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. తుతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని వ్యవసాయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోమోర్ లో నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయని, గత కొంతకాలంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


విత్తనాలు మంచివి అని, దిగుబడి మంచిగా వస్తుందని రైతులకు గ్రోమోర్ లలో పనిచేసే వారు చెప్పడంతోనే విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని, తీరా పంట వేసిన తర్వాత పరిస్థితి మరోలా ఉంటుందని, ఇదేందని ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారనీ, ఎరువుల షాపుల రైతులు అనేక సార్లు గొడవకు దిగిన ఘటనలను గుర్తు చేశారు. పట్టణంలో పలు షాపులలో తనిఖీలు నిర్వహించిన మరుసటిరోజే ఏఐకేఎంఎస్ రైతు సంఘం నాయకులు గ్రోమోర్ ముందు ధర్నా నిర్వహిస్తూ, తక్షణమే గ్రోమోర్ షాపును సీజ్ చేయాలని విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్