నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేర్ పట్టణంలోని గ్రోమోర్లో నకిలీ విత్తనాలు అమ్మారనే వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విత్తన శాస్త్రవేత్తలు నెగ్గు తేలుచుతారని, ఆలేరు మండల వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో బుదవారం ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన రైతు ఆలేరు పట్టణంలోని గ్రోమోర్ లో వరి విత్తనాలు కొనుగోలు చేశారని, వరి మొలకెత్తక, కలుపు మొలకెత్తిందని రైతు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై రైతు నుండి వివరాలు తీసుకుని యాదగిరి గుట్ట మండల ఏవో కి తెలియజేశామని చెప్పారు. గతంలో మండలంలోని సాయిగూడెంతో పాటు పలు గ్రామాలలో ఇదే పరిస్థితిని రైతుల ఎదుర్కొన్నారని ఏవో దృష్టికి నవతెలంగాణ రిపోర్టర్ తీసుకెళ్లారు. విత్తనాలు నకిలీవా.. కాదా అనేది సైంటిస్టులు నిగ్గు తేల్చుతారని ఏవో స్పష్టం చేశారు.






కామెంట్లు (0)