Magazines

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

40 నిమిషాల క్రితం

nutrition food
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

మహాదేవపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ రాధిక

నవతెలంగాణ-మల్హర్ రావు

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మహాదేవపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ రాధిక అన్నారు. బుధవారం మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన తాడిచెర్ల, వల్లెంకుంట  రెండు సెక్టార్ల అంగన్ వాడి టీచర్లు నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి సిడిపిఓ, సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై ఆహార పదార్థాలను ప్రదర్శించి పోషకాహారంపై అవగాహణ కల్పించి మాట్లాడారు. తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రసన్న,అక్షరాబ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు,ఆయాలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్