నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ ప్రధాన రహదారిపై రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు స్ప్రే చేయిస్తూ, క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ పరిధిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ఉన్న ఇసుకను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. రోడ్డుపై ఇసుక కారణంగా వాహనదారులు, లారీ డ్రైవర్లు ప్రమాదాల బారిన పడకుండా ఈ పనులు చేపట్టారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ మహమ్మద్ రెహానా కమల్ భర్త కమల్ పాషా ఈ పనులను స్వయంగా పర్యవేక్షించారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి మున్సిపల్ సిబ్బందికి సూచనలు ఇస్తూ పనులను వేగవంతం చేయించారు. రహదారుల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించిన మున్సిపల్ పాలకవర్గానికి ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. చైర్‌పర్సన్ రెహానా కమల్, ఆమె భర్త కమల్ పాషాలకు పట్టణ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ చర్యతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సురక్షితంగా, సులభంగా మారాయి. మున్సిపాలిటీ చేపట్టిన ఈ పారిశుధ్య కార్యక్రమం పట్ల సత్తుపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






కామెంట్‌లు (0)