Magazines

పేలిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

1 గంట క్రితం

transformer
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 

అసలే కరంట్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి మరో ఇబ్బంది ఏర్పడింది. గురువారం మండలంలోని రైస్ మిల్-పెట్రోల్ బంక్ సమీపంలో వరి పంటపొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మధ్యాహ్నం ఒక్కసారిగా పేలింది. ఆ సమయం అక్కడ ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ శ్రీధర్ ను వివరణ కోరగా.. ట్రాన్స్ ఫార్మర్‌ పేలిన సమాచారం అందలేదని, సమస్య ఎలా వచ్చిందనేది క్ష‍ుణ్ణంగా పరిశీలించి, శుక్రవారం రిపేర్ చేస్తామని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్