Magazines

పోతారం క్రాస్ రోడ్డుపై లారీ బోల్తా

2 గంటల క్రితం

Lorry
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

రాజీవ్ రహదారిపై నిలిచిన వాహనాలు

నవతెలంగాణ - బెజ్జంకి

మండల పరిధిలోని పోతారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం రాజీవ్ రహదారికి అడ్డుగా లారీ బోల్తా పడింది. విజయవాడ నుంచి కరీంనగర్ కు కోడిపిల్లలతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని పలువురి భావిస్తుండగా..రోడ్డుకు అడ్డుగా అడవిపందులు రావడంతో లారీ బోల్తా పడినట్టు డ్రైవర్ చెప్పారు. దీంతో రాకపోకలకు వాహనదారలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలా సేపటి వరకు రహదారిపై ట్రాఫిక్‌ స్థంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిలిచిన వాహనాలను క్రమబద్ధీకరించారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్