Magazines

ఇఫ్తికార్ అహ్మద్‌కు మాజీ మంత్రి పరామర్శ

50 నిమిషాల క్రితం

consults
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - వనపర్తి 
పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఇఫ్తికార్ అహ్మద్ అనారోగ్యంతో గాంధీ చౌక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇఫ్తికార్ అహ్మద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, గంధం పరంజ్యోతి, వెంకట్ సాగర్, రహీం, జోహేబ్ హుస్సేన్, అస్లాం, జబ్బార్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్