Magazines

బీకే గోల్డ్ పత్తి విత్తనాలతో  అధిక లాభాలు 

52 నిమిషాల క్రితం

BK Gold cotton seeds
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పి.వి. నారాయణ గౌడ్ 

నవతెలంగాణ-మిడ్జిల్

బి కే గోల్డ్ పత్తి విత్తనాలతో పండించిన పంట ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చని బి కే  గోల్డ్  కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పి.వి. నారాయణ గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలంలోని రాణి పేట  గ్రామంలో రైతు బిల్లే రాజబాబు పొలంలో సాగు చేసిన బీకే గోల్డ్ పత్తి పంటను రైతులతో కలిసి   ఆయన క్షేత్రస్థాయిలో పత్తి పంటను  పరిశీలించారు. బీకే గోల్డ్ పత్తి విత్తనాలు రసం పీల్చే పురుగులను, గులాబీ రంగు పురుగులను తట్టుకొని నాణ్యమైన జడకాపుతో అద్భుతమైన దిగుబడిని ఇస్తాయని పేర్కొన్నారు.


ఈ హైబ్రిడ్ విత్తనాలు తక్కువ పెట్టుబడితో  ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతూ  ,రైతులకు ఒక నమ్మకమైన విత్తనంగా నిలిచాయి  అని సూచించారు..

పత్తి చేనును సందర్శించి, పంట ఎదుగుదల మరియు కాయ సైజుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంట  పరిశీలనాలో  250 మంది రైతులు రావడం  గర్వకారణం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాణి పేట రోహిణి డీలర్ వెంకటయ్య,  మండలంలో ని రాణి పేట, అయ్యవారిపల్లి, వల్లపు రావు పల్లి, మున్నా న, చిల్వేర్ గ్రామాలకు చెందిన రైతులు దేవయ్య, చుక్కయ్య, శివుడు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్