Magazines

తండ్రిని కొట్టిచంపిన కొడుకు

1 గంట క్రితం

దిఏద
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నవాబుపేట
కన్నకొడుకే తండ్రిని కర్ర, రాయితో విచక్ష‍ణా రహితంగా కొట్టి చంపిన ఘటన మండల పరిధిలోని దేపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపోలు రాములు (55) చిన్న కొడుకు సురెందర్ నిత్యం మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండేవాడు.

ఈ విషయమై తండ్రీ కొడుకులు తరచూ గొడవలు పడేవారని చెప్పారు. ఎప్పటిలాగే ఆదివారం కూడా ఇద్దరూ గొడవపడిన క్రమంలో తండ్రి రాములును కర్ర, రాయితో తలపై విచక్షణా రహితంగా కొడుకు సురేందర్‌ దాడిచేసి చంపారని తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ గాంధీ నాయక్, ఎస్ఐ నరెందర్ గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించి స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి మరో కొడుకు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సురెందర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరెందర్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్