నవతెలంగాణ-ఆలేరు రూరల్
గ్రామీణ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని సర్పంచ్ పరదే మమత తెలిపారు. ఆదివారం ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో కమల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ సూచించారు.కార్యక్రమంలో వైద్యులు డా. అశోక్ కుమార్, డా. ఆశ, డా. కార్తీక్ రావు, డా. శ్రావ్య, మాజీ సర్పంచ్ బక్క రాంప్రసాద్, ఉప సర్పంచ్ మద్దెల నరేష్, పరదే సంతోష్, ఎర్ర రజిత, ఎర్ర దేవేంద్ర, కందుల సత్యనారాయణ, తుంగ సుస్మిత, మల్లేష్, జవ్వాజి ప్రదీప్, తాళ్ల సాంబరాజు, వస్పరి మల్లేష్, తుంగ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)