Magazines

వేలంలో భారీ ధర పలికిన వీ యూత్‌ గణేశుడి లడ్డు

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌

ఆలేరు రైల్వే స్టేషన్ ఎదురు గల్లీలో వి యూత్ అసోసియేషన్ వినాయకుడి వద్ద ఆదివారం జరిగిన వేలంపాటలో రూ. 2 లక్షల 76 వేలకు గంప కృష్ణ వినాయకుడి లడ్డుని దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే 1,20,000 అధికంగా ఈసారి వేలం పాట జరిగింది. వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆ లడ్డుని ఆయన ఇంటి వద్దకు బ్యాండ్ మేళాలతో తీసుకొని అప్పగించారు. దీంతో ఆలేర్ పట్టణంలో, మండలంలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్