Magazines

సాహితీ వార్తలు

2 గంటల క్రితం

ఆక్టోబర్ 1 న  బోయ జంగయ్య జయంతి ప్రసిద్ధ సాహితీ వేత్త బోయ జంగయ్య జ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం

ఆక్టోబర్ 1 న బోయ జంగయ్య జయంతి
ప్రసిద్ధ సాహితీ వేత్త బోయ జంగయ్య జయంతిని తెలంగాణ సాహిత్య అకాడమీ రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో ఆక్టోబర్ 1న సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో డా.ఎన్ బాలాచారి, శ్రీమతి ఏ. వాణిప్రసాద్, ఏనుగు నరసింహారెడ్డి IAS, కోయ కోటేశ్వరరావు, దున్న యాదగిరి, కృపాకర్, ప్రొ.కాసీం, బోయ చేతన్, బీఎస్ రాములు తదితరులు పాల్గొనే కార్యక్రమంలో పునాస సంచికను ఆవిష్కరిస్తారు. డా. నామోజు బాలాచారి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ



‘గుగ్గిలం’ పుస్తకావిష్కరణ సభ
ప్రభలత, డప్పోల్ల రమేష్ సంపాదకత్వంలో వెలువడిన మహాకవి గుర్రం జాషువా స్మృతి కవిత్వం ‘గుగ్గిలం’ సంకలనం ఆవిష్కరణ సభ అక్టోబర్ 1న టిపిటిఎఫ్ భవన్, శాంతినగర్, సంగారెడ్డి నందు సాయంత్రం 5:30 నిమిషాలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏనుగు నరసింహారెడ్డి, డా. నాళేశ్వరం శంకరం, డా. జె. జయప్రకాష్, డా. బెల్లంకొండ సంపత్ కుమార్, కందుకూరి శ్రీరాములు, కెంపుల రాజు, మాతంగి చిరంజీవి, అబ్రహం మాదిగ, బి. అమృత్, రాంచందర్ భీం వంశీ, అమృత్ బండారి, ఎ. చంద్రమోహన్, సొన్నాయిల బాల్‌‌రాజ్ పాల్గొంటారు. బహుజనం సాంస్కృతిక వేదిక - తెలంగాణ, 9550923323

‘

అదనపు కణజాలం’ ఆవిష్కరణ
తె.ర.వే., క.ఫి.సో., అంబేద్కర్ ఫులే పెరియార్ అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2 ఉదయం 10.30గంటలకు కందుకూరి అంజయ్య కవిత్వం ‘అదనపు కణజాలం’ పుస్తక ఆవిష్కరణ క.ఫి.సో. భవన్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సివి కుమార్, ఆచార్య జయధీర్ తిరుమలరావు, కొండి మల్లారెడ్డి, కూకట్ల తిరుపతి, పుప్పాల శ్రీరామ్, బూర్ల వెంకటేశ్వర్లు, తోట నిర్మలరాణి, పండుగ రత్నయ్య పాల్గొంటారు. తెలంగాణ రచయితల వేదిక

‘నడిపించిన వాక్యం’ పుస్తకావిష్కరణ
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం జంటనగరాలు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి గడ్డం సులోచన రచించిన ‘నడిపించిన వాక్యం’ కవితా సంపుటి అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభకు కందుకూరి శ్రీరాములు, నందిని సిద్ధారెడ్డి, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలా చారి, కొండపల్లి నీహారిణి, బెల్లంకొండ సంపత్ కుమార్, ఉదారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెరసం, 9440119245


పిఠాపురం మహారాజా సాహితీ పురస్కారాలు


పిఠాపురం మహారాజా 41 వ జయంతి సందర్భంగా నిర్వహించిన కావ్య/కథా సంపుటాల పోటీలో ఉత్తమ కావ్యంగా ఈతకోట సుబ్బారావు రచించిన ‘పెన్నానది’, ఉత్తమ కథా సంపుటిగా ఎమ్.ఆర్.వి సత్యనారాయణ మూర్తి రచించిన ‘తుమ్మెద... ఓ తుమ్మెద’ ఎంపికయ్యాయి. ఆదిత్య - పిఠాపురం మహారాజా సాహితీ సేవా పురస్కారం నవ మల్లెతీగ మాసపత్రిక సంపాదకులు కలిమిశ్రీ అందుకుంటారు. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అక్టోబర్ 5 నపిఠాపురంలో జరుగుతుంది. - ఆదిత్య స్కూల్

కళింగాంధ్ర వర్తమాన సాహిత్య సదస్సు
అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం జిల్లా శాఖ,సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘కళింగాంధ్ర వర్తమాన సాహిత్యం సదస్సు’ అక్టోబర్‌ 4‌న చాసో సాహిత్య వేదిక, గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో షణ్ముఖానంద, చింతకింది శ్రీనివాసరావు, రామసూరి సీతారామయ్య, బి. వెంకటపతిరాజు, జి.ఎస్. చలం తదితరులు పాల్గొంటారు.
కందేపి రాణీ ప్రసాద్‌‌కు వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం

‘డా. వేదగిరి రాంబాబు బాలసాహిత్య పురస్కారం 2026’ గాను డా.కందేపి రాణీప్రసాద్‌ ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అక్టోబర్‌ 14 ‌జరిగే సభలో అందజేస్తారు. సింహప్రసాద్‌, కన్వీనర్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్