Magazines

కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనను విజయవంతం చేయండి

1 గంట క్రితం

malahar rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్

నవతెలంగాణ - మల్హర్ రావు

ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం 28న  నిరసన, ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా డిసి అధ్యక్షులు బట్టు కర్ణాకర్ హాజరవుతారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని గ్రామాల యూత్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, మహిళ విభాగం, ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఎస్టీ సెల్ అధ్యక్షులు  అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్