Magazines

జ్ఞానేశ్‌ హటావో.. ఎన్నికల కమిషన్‌ బచావో

3 గంటల క్రితం

జ్ఞానేశ్‌ హటావో.. ఎన్నికల కమిషన్‌ బచావో
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

​సీఈసీ రాజీనామాకు దేశవ్యాప్త ఆందోళనలు

​ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసనలు

ఎంపీలు ఏఏ రహీం, వి. శివదాసన్‌ సహా పలువురి అరెస్టు


​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై తలెత్తిన వివాదాల నేపథ్యంలో ‌సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం ‘నిర్వచన్‌ సదన్‌’ ఎదుట, జంతర్‌మంతర్‌ వద్ద ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ‘జ్ఞానేష్ ‌ హటావో.. ఎన్నికల కమిషన్‌ బచావో’ అంటూ ప్లకార్డులు, బ్యానర్లతో నినదించాయి. జ్ఞానే‌శ్‌కుమార్‌ ముఖముసుగులు ధరించి ఆందోళన చేసిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. నిర్వచన్‌ సదన్‌ వద్ద ఢిల్లీ పోలీసులు, సీఏపీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు అడ్డుకున్నాయి. బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను నిలువరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పలుచోట్ల జలఫిరంగులను ప్రయోగించినట్లు నిరసనకారులు తెలిపారు.

ఎంపీలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

ఆందోళనలో పాల్గొన్న సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం, వి. శివదాసన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనాల్లోకి ఈడ్చుకెళ్లడంపై నిరసన వ్యక్తమైంది. యూనిఫాం లేని పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారని ఎంపీ విమర్శించారు.

విద్యార్థుల ర్యాలీపై పోలీసుల నిర్బంధం
పటేల్‌చౌక్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజీ, నాయకులు ఎంఎల్‌ అభిజిత్‌, సూరజ్‌ ఇళమన్‌, మెహినాఫాతిమా, అనిల్‌ సేతుమాధవన్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్