గవర్నర్‌కు బీజేపీ ఎమ్మెల్సీ
మల్క కొమరయ్య వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో స్పార్ష్ ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌ను కోరారు. ఈమేరకు శుక్రవారం లోక్‌భవన్‌లో శివప్రతాప్ శుక్లాను వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను సరిదిద్దడంతోపాటు, జిల్లా స్థాయిలో పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఏకరీతి మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కుసుమ్, ఈ-నామ్, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మిషన్ ఇంద్రధనుష్, ఈ-సంజీవని, ఈ-శ్రమ్, పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ సహా మొత్తం 22 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి నెలా పథకాల అమలుపై సమీక్ష నిర్వహించడంతోపాటు, అమలులో జాప్యం, నిర్లక్ష్యం చోటుచేసుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)