Magazines

ఎన్నికల సంఘం ఓటు హక్కును కాలరాస్తోంది

49 నిమిషాల క్రితం

ఎన్నికల సంఘం అక్రమంగా ఓట్లను
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం


ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హయత్‌నగర్‌
ఎన్నికల సంఘం అక్రమంగా ఓట్లను తొలగిస్తూ ప్రజల ప్రాథమిక హక్కైన ఓటు హక్కును కాలరాస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. సర్‌ పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ ‌పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌ డివిజన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కొత్త నిబంధనల పేరుతో పెద్ద సంఖ్యలో భారత పౌరుల ఓట్లను తొలగించారని తెలిపారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, పేదల ఓట్లను తొలగించే విధంగా చర్యలు జరుగుతున్నాయన్నారు. ప్రజల ప్రాథమిక హక్కైన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నూతన నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను రూపొందించాలని కోరారు. ఎన్నికల సంఘం చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బోడ సామేలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా పనిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.చంద్రమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, రవీంద్రశర్మ, సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యదర్శి సీహెచ్‌.వెంకన్న, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, సర్కిల్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్