Magazines

గాంధీ పరివారా... 
సంఘ్‌ పరివారా‌!

3 గంటల క్రితం

Gandhi Parivar... the Sangh Parivar!
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

దేశ ప్రజలు తేల్చుకోవాలి భావి ప్రధానిగా రాహుల్‌‌ను 
చూడటమే మా లక్ష్యం

వాతావరణం నుంచి రాజకీయాల వరకు... అన్నీ కేరళం నుంచే మొదలు

బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్‌-2026 అవార్డు స్వీకరణోత్సవంలో సీఎం రేవంత్‌‌రెడ్డి


​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘గాంధీ పరివార్ లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే, మతం, కులం, ప్రాంతం, భాష ఆధారంగా సంఘ్ పరివార్ దేశాన్ని విభజిస్తోంది. గాంధీ పరివార్ త్యాగానికి ప్రతీక అయితే, సంఘ్‌ ‌పరివార్‌ ‌కుట్రలకు, మతోన్మాదానికి ప్రతీక. ఈ క్రమంలో గాంధీ పరివారా... సంఘ్‌ పరివారా అనే విషయాన్ని దేశ ప్రజలు తేల్చుకోవాలి’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘ఆర్యదాన్ ముహమ్మద్ - బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్-2026’ అవార్డును శుక్రవారం కేరళంలోని నిలంబూరులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‌చేతుల మీదుగా సీఎం రేవంత్‌ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలను అర్పిం‌చారని తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పదవి, అధికారం, హోదాను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, స్వేచ్ఛను కాపాడేందుకు మనమందరం గాంధీ పరివార్‌‌కు అండగా ఉందామని పిలుపునిచ్చారు. కేరళం రాజకీయాలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాతావరణ నిపుణులు రుతుపవనాల కోసం కేరళం వైపు ఎలా చూస్తారో... దేశ రాజకీయాలను అర్థం చేసుకునే విషయంలోనూ కేరళంను ఒక సంకేతంగా చూడవచ్చన్నారు.

దేశంలో అధికార మార్పిడి కూడా కేరళం రాజకీయాల నుంచే మొదలవుతాయనే చరిత్ర ఉందని తెలిపారు. ‘కేరళంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం కోల్పోయినప్పుడు దేశంలో అధికారం కోల్పోయాం. వాతావరణమైనా... రాజకీయాలైనా కేరళం నుంచి మొదలై తుఫానుగా మారుతాయి. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీసీ అధ్యక్షుని నుంచి సీఎం వరకు తన 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో అత్యున్నత స్థాయిలను చూసిన నాకు వ్యక్తిగత ఆశయాలంటూ ఏమీ లేవు. రాహుల్ గాంధీని భారతదేశ ప్రధానమంత్రిని చేయడమే నా ఏకైక కల. ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఓట్‌ ‌చోరీ, పార్టీల చోరీ, గుర్తుల చోరీ, నిధుల చోరీ చేస్తూ చివరికి యువత భవిష్యత్తును బీజేపీ దొంగిలిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కేరళం నుంచి మొదలైన కాంగ్రెస్ గాలిని భారతదేశ మంతటా విస్తరించేందుకు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు, నాయకులు నిబద్ధతతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదు దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేసిన కేరళం రాజకీయ దిగ్గజం ఆర్యదాన్ ముహమ్మద్ అవార్డు కేరళేతర వ్యక్తికి, అందులో తనకు రావడం గర్వంగా ఉందని చెప్పారు. కేరళంకు రావడం తనకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సమయంలోనూ, కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఇక్కడికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిసారీ కేరళం ప్రజలు తనకు ఆత్మీయ స్వాగతం పలికారని చెప్పారు. లౌకికవాదానికి అండగా నిలుస్తూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్న కేరళం ప్రజలకు ఆయ‌న‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌, కేరళం కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్