Magazines

‌కరువు బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి

55 నిమిషాల క్రితం

The state must be saved from the grip of drought.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి జీవన్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
భేషజాలకు పోకుండా కరువు బారినుంచి రాష్ట్రాన్ని కాపాడాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్‌నినోతో దేశంలో దుర్భిక్ష ప్రభావం ఉందన్నారు. తెలంగాణలో మాత్రం ఎల్‌నినో తెచ్చిన కరువులా కాకుండా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువులా భావించాలని చెప్పారు. నీళ్లున్నా సద్వినియోగం చేసుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా కాళేశ్వరం కట్టారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు పేరొస్తుందని క‌న్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తడం లేదన్నారు. నీళ్లు ఎత్తిపోసి అన్ని రిజర్వాయర్లను నింపుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. రేవంత్, ఉత్తమ్ కుట్రపూరితంగా రాష్ట్రాన్ని కరువులోకి నెట్టేశారని విమర్శించారు. లక్ష క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు కొరత ఉందన్నారు. సింగరేణి జైపూర్ విద్యుత్ ప్లాంట్‌ను రాజస్థా‌న్‌కు తాకట్టు పెట్టే కుట్ర చేస్తున్నా‌రని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అస్తవ్యస్త పాలనే కరువుకు కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగబాలు, నాయకులు గాంధీ నాయక్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్