గ్రామ అవసరాలు, వనరులతో
రంగురంగుల ముగ్గులతో గ్రామ పటాలు
భాగస్వాములను చేస్తూ పారదర్శకంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికపై ప్రజలతో చర్చించి తీర్మానాలు
గ్రామసభ తీర్మానాలను ప్రణాళికాబద్ధంగా
అమలు చేయాలి : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించడం, రాబోయే కాలానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం లక్ష్యంగా గ్రామసభలను నిర్వహించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో పల్లెల్లో ప్రత్యేక గ్రామసభలను పండగ వాతావరణంలో నిర్వహించారు. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై గ్రామ పటాలను రూపొందించారు. గ్రామంలోని రహదారులు, తాగునీటి వనరులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పారిశుధ్య సదుపాయాలు, సాగునీటి వనరులు, ఇతర మౌలిక వసతులతో పాటు అవసరమైన అభివృద్ధి పనులను ఈ గ్రామ పటాల్లో పొందుపరిచారు.
ప్రత్యేక గ్రామసభల్లో గ్రామ ప్రజల అవసరాలు, సమస్యలు, ప్రాధాన్యతలను గుర్తించి వాటిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులు, వివిధ శాఖల పథకాలను సమన్వయం చేసుకుని గ్రామానికి అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామసభల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వర్షపు నీటి సంరక్షణ, ఉపాధి, జీవనోపాధి, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా వివిధ శాఖల పథకాలను సమన్వయం చేసి అభివృద్ధి ప్రణాళికలో చేర్చేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక గ్రామసభలకు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు హాజరై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను
గ్రామసభ తీర్మానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రత్యేక గ్రామసభల్లో ప్రజలు చేసిన సూచనలు, తీసుకున్న తీర్మానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామసభలో గుర్తించిన అవసరాలను జీపీడీపీలో ప్రతిబింబించాలని, అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ పథకాలు, శాఖల సమన్వయంతో ప్రాధాన్యతా పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలను గుర్తించి, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ రూపొందించే గ్రామాభివృద్ధి ప్రణాళికలు పల్లెల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.






కామెంట్‌లు (0)