Magazines

థ్రిల్‌ చేసే ‘తత్వం’

58 నిమిషాల క్రితం

Thrilling Philosophy
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం'. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ,‘ఈ సినిమా సమయంలో చాలా స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేశాం. ఈ సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసిన సమయంలో హీరో, హీరోయిన్‌ కారు యాక్సిడెంట్‌కు గుర య్యారు. వాళ్లు కోలుకునే సరికి టైమ్‌ పట్టింది. అందుకే సినిమా రిలీజ్‌ మళ్లీ డిలే అయ్యింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసి అక్టోబర్‌ 2న విడుదల తేదీ ప్రకటించాం. అయితే సడన్‌గా మేం విడుదల చేస్తున్న రోజే డజను సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా సరే, కంటెంట్‌ మీద నమ్మకంతో అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ట్రైలర్‌, పాటలు చూసి అందరూ పాజిటివ్‌ ఆరా ఇచ్చారు. ఓ థ్రిల్లర్‌ మూవీకి కావాలసిన అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులు ఇచ్చిన స్పందనతోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించు కున్నాం. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్ర సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో మా కష్టాలన్నీ మరిచిపోతాం' అని అన్నారు. ‘మేము వెండితెరపై ఈ సినిమా చూసి, ఆడియన్స్‌ ఆదరణ చూసి మా కష్టాలు మరిచి పోతాం’ అని నిర్మాత శీమకుర్తి వంశీ కృష్ణ చెప్పారు. దినేష్‌ తేజ మాట్లాడుతూ,‘కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందో ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్ర విజయంపై విశ్వాసం ఉంది’ అని అన్నారు. ‘తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని, మా అందరికి మీ సపోర్ట్‌ ఉంటుందని అనుకుంటు న్నాను’ అని హీరోయిన్‌ దష్విక చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్