Magazines

బంటీ చేసిన తప్పేంటి?

1 గంట క్రితం

mistake
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘చూసి చూడంగానే’ వంటి చిత్రా లను నిర్మించిన నిర్మాత రాజ్ కందు కూరి మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్నారు. ఆయన ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ కందుకూరి హీరోగా ‘టాల్కమ్ పౌడర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి నాథ్ పొన్నా రచన, దర్శ కత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ద్రిషికా చందర్ కథానాయిక. న్యూ ఏజ్ క్రైమ్ డ్రామెడీగా తెర కెక్కుతున్న ఈ సినిమా ప్రమో షన్స్‌ను తాజాగా ‘ది ఫస్ట్ స్ప్రిం కిల్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ప్రారంభించారు. గ్లింప్స్‌లో బంటీ అనే డ్రగ్ పెడ్లర్ చుట్టూ కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. తెలియక చేసిన ఓ తప్పు కారణంగా బంటీ అనూ హ్యమైన పరిస్థితుల్లో చిక్కు కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్‌స్టర్లు అతని కోసం వేట మొదలుపెట్టడంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారు తాయి. అసలు బంటీ చేసిన తప్పేంటి? ఈ చిక్కుల నుంచి అతను ఎలా బయటపడతాడు? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ.. సినిమా ప్రపంచంపై ఆసక్తిని పెంచేలా గ్లింప్స్ సాగింది. దర్శకుడు సాయినాథ్ పొన్నా అద్భుతమైన కథనంతో ప్రత్యేకమైన టచ్ ఇచ్చారు. శివ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా, వెంకటేష్ మహా, జీవన్ కుమార్ పాత్రలను కూడా పరిచయం చేశారు. సినిమా టోగ్రాఫర్ జీవీ అజయ్ కుమార్ విజువల్స్, ఓషో వి తన సంగీతంతో కథకు మరింత ఎనర్జీని జోడిం చారు. సూర్య పొన్నపల్లి ఎడిటింగ్ రేసీగా ఉంది’ అని చిత్ర బృందం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్