Magazines

క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి దారుణ హత్య

1 గంట క్రితం

cricket bat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియోపోలిస్ కురుమ సంఘం భవన్ వద్ద మృతదేహం లభ్యమైంది. అయితే ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్నగా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వెంకన్న ఉస్మానియా క్యాంపస్‌లో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్