Magazines

కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

1 గంట క్రితం

Cm Revanth Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: పేదల సమస్యల పరిష్కార వేదికలుగా కలెక్టరేట్ కార్యాలయాలు సక్రమంగా ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి మంచి పేరొచ్చినా, చెడ్డ పేరొచ్చినా అది పూర్తిగా ఉద్యోగుల పనితీరు వల్లే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనే భావన ప్రజల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక ప్రతినిధులని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 4 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 97 శాతం ప్రజలకు సేవ చేయడం శ్రమతో కూడుకున్న పనైనప్పటికీ, ఎంతో బాధ్యతగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్