నవతెలంగాణ-వనపర్తి
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి బుధవారం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి క్షీరాభిషేకం, జలాభిషేకం, పత్ర పుష్పాలతో అభిషేకాలు సమర్పించారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణపక్ష చవితి తిథి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకోవడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతతను కలిగించిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి కృపాకటాక్షాలు వనపర్తి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నిర్వాహకులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారిని శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ దర్శనం లో ఎమ్మెల్యే గారి వెంట మనిగిల్ల తిరుపతిరెడ్డి ఉన్నారు.





కామెంట్‌లు (0)