Magazines

సహకార సంఘం రైతుల అభివృద్ధికి కృషి

57 నిమిషాల క్రితం

husnabad
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

- విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ

- సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
నాణ్యమైన విత్తనోత్పత్తి తో రైతులు అభివృద్ధి చెందడంలో సహకార సంఘం కృషి ఉంటుందని  సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య అన్నారు. బుధవారం రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట ఆధ్వర్యంలో హుస్నాబాద్‌ సొసైటీ కార్యాలయంలో రైతులకు విత్తనోత్త్తిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ నిఖిల్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లాలో జగదేవ్‌పూర్, హుస్నాబాద్, గంగాపూర్ సహకార సంఘాలను విత్తనోత్పత్తి కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.


తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి మాట్లాడుతూ పునాది విత్తనాల వినియోగంతో 10–15 శాతం వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి సహకార సంఘం పరిధిలో ఐదుగురు రైతులకు ఐదు ఎకరాల్లో సాగు చేసేందుకు కేఎన్‌ఎం–1638 సన్న రకం బ్రీడర్ విత్తనాలు అందించినట్లు తెలిపారు. ఈ రకం 120–130 రోజుల్లో కోతకు వస్తుందని, ఉల్లికోడు, అగ్గి తెగుళ్లను తట్టుకుంటుందని వివరించారు. అలాగే 30–40 ఎకరాలకు జనుము విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సరిత విత్తనోత్పత్తిలో పంట స్వచ్ఛత, పొల నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ అధికారి వేల్పుల పూజ, కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్, డైరెక్టర్లు  తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్