Magazines

రెజ్లింగ్ లో ఇండియాకు కాంస్యం

1 గంట క్రితం

Sunil Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా గేమ్స్ -2026లో పురుషుల 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో ఈవెంట్‌లో ఇండియాకు రెజ్లింగ్ పతకాల ఖాతాను తెరిచాడు. ఫిలిప్పీన్స్‌కు చెందిన కాలమ్ జాన్‌స్టన్ రాబర్ట్స్‌పై సునీల్ ఆధిపత్య ప్రదర్శన కనబరిచి, టెక్నికల్ సుపీరియారిటీతో 9-0 తేడాతో విజయం సాధించాడు. 2022 ఆసియా క్రీడల్లోనూ సునీల్ కుమార్‌ కాంస్యం నెగ్గాడు. దీంతో వరుసగా రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్నట్లయింది. దీంతో గ్రీకో- రోమన్ స్టైల్స్‌లో పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా సునీల్ కుమార్‌ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల సంఖ్య 60కి చేరుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్