Magazines

ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలి

54 నిమిషాల క్రితం

Grains
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం


- ఐసీడీఎస్ ప్రాజెక్టు దుబ్బాక సీడీపీఓ ఎల్లయ్య

నవతెలంగాణ - తొగుట

అంగన్‌వాడీ ప్రీ-స్కూల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు దుబ్బాక సీడీపీఓ ఎల్లయ్య సూచించారు. బుధవారం తొగుట సెక్టార్ పరిధిలోని పెద్ద మాసాన్‌పల్లి రైతువేదికలో సెక్టార్ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల్లో భాగంగా ‘మన అంగన్‌వాడీ - మన బాధ్యత’ అనే థీమ్‌తో ఈ సందర్భంగా ఆహార వైవిధ్యం, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహా రం, పోషకాహార ప్రాధాన్యతపై గర్భిణీలకు, బాలిం తలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. సీడీపీఓ మాట్లాడుతూ  దుబ్బాక ప్రాజెక్టు పరిధిలో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్ణీత షెడ్యూ ల్ ప్రకారం పోషణ్ మాసం కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఒక పూట సంపూర్ణ పోషకాహారాన్ని, అంగన్‌వాడీ ప్రీ - స్కూల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో తల్లి ఆరో గ్యం, పోషకా హారం, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని అన్నారు. గర్భిణీలు ప్రతిరోజు సమ తుల్య ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, కూర గాయ లు, పప్పులు, పాలు, గుడ్లు, పండ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తగిన మోతా దులో తీసుకోవాలని సూచించారు. వైద్యుల సూచ న మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మాత్ర లను క్రమం తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.

- పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీలేఖ మాట్లాడుతూ.. గర్భిణీలు, కుటుంబ సభ్యులు రోజువారీ ఆహారం లో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచిం చారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామ లు వంటి చిరుధాన్యాల్లో పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పారు. స్థాని కంగా లభించే చిరుధాన్యాలతో వివిధ రకాల వంట కాలు చేసుకుని ఆహార వైవిధ్యాన్ని పెంచుకోవాలని వివరించారు. గర్భిణీ లు, బాలింతల్లో రక్తహీనత నివారణతో పాటు ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ఏఎన్‌ఎం కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు, తొగుట సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తదిత రులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్