నవతెలంగాణ - హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి బిహార్‌కు వెళ్తున్న వోల్వో బస్సును ఎదురుగా వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు, ఎడమవైపు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)