నవతెలంగాణ - హైదరాబాద్: ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఎమ్మెల్యే శంకర్ పాత్రలో నటుడు ప్రియదర్శి ఆకట్టుకున్నారు. ఈ పాత్ర కేసీఆర్‌ను పోలి ఉండటంతో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రియదర్శిని తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ‘బలగం’, ‘మల్లేశం’ నుంచి ‘ది ప్యారడైజ్’ వరకు ప్రియదర్శి తన చిత్రాల్లో అద్భుతంగా నటించారని కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని గుర్తుండిపోయే చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు.
‘ది ప్యారడైజ్’ నటుడు ప్రియదర్శికి హరీశ్ రావు సన్మానం
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)