Magazines

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

1 గంట క్రితం

Fatal road accident in Gujarat.. Five dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌–వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయివేటు బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్