Magazines

భారత్‌కు ఆర్చరీలో మరో స్వర్ణం

1 గంట క్రితం

Another gold for India in archery
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆర్చరీలో మరో స్వర్ణ పతకం దక్కింది. కాంపౌండ్‌ ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన చికితారావు, మహారాష్ట్రకు చెందిన రాజేశ్‌ జోడీ విజయం సాధించింది. ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు 8 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్య పతకాలు చేరాయి. కాంపౌండ్‌ ఆర్చరీలో రెండు గంటల వ్యవధిలోనే భారత్‌కు రెండు స్వర్ణాలు లభించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్