Magazines

అక్టోబర్‌ 2న మాంసం, వైన్‌ షాపులు బంద్‌

1 గంట క్రితం

Meat and wine shops to remain closed on October 2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాంసం, వైన్‌ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలు, మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.

స్టాండింగ్‌ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఉత్తర్వులను అమలు చేసేందుకు మున్సిపల్‌ అధికారులకు సహకరించాలని కోరింది. కాగా, అక్టోబర్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా కూడా మాంసం, వైన్‌ షాపులు మూసివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్