నవతెలంగాణ - హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బియ్యం ధరలు గత మూడు నెలల్లో గణనీయంగా పెరిగాయి. కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పెరగడంతో ప్రస్తుతం సన్నబియ్యం ధర రూ.70 వరకు, నాణ్యమైన బియ్యం రూ.80కి పైగా పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడి పడిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ అంచనా ప్రకారం, దేశంలో బియ్యం ఉత్పత్తి 5-7 శాతం, అంటే సుమారు 12 మిలియన్ టన్నుల వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో మార్కెట్‌లో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగింది.






కామెంట్‌లు (0)