నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా కొనసాగుతోంది. పోటీల 10వ రోజున భారత్ రజత పతకంతో ఖాతా తెరిచింది. మహిళల ట్రాప్ షూటింగ్ ఫైనల్‌లో నీరూదండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ బృందం రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.
346 పాయింట్లతో చైనా జట్టు స్వర్ణ పతకం దక్కించుకోగా.. భారత్ 328 పాయింట్లతో రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ నాలుగు స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్య పతకాలు సహా మొత్తం 46 పతకాలు సాధించింది.






కామెంట్‌లు (0)