నవతెలంగాణ - హైదరాబాద్ : : రైలు ఢీకొని దాదాపు 100 గొర్రెలు మృతి చెందిన విషాద ఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుషాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన గొర్రెల కాపరులు గొర్రెలను మేపుతూ అవుషాపూర్ సమీపంలోని కేపాల వద్ద సేదతీరుతున్నారు. తెల్లవారుజామున గొర్రెలు రైల్వే పట్టాలపైకి వెళ్లడంతో అటుగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టినట్లు సమాచారం.
కాజీపేట నుంచి హైదరాబాద్ నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని గొర్రెల కాపరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గోర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గొర్రెలపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.






కామెంట్‌లు (0)