నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యువత స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థిక చేయూత అందించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బీసీ సంక్షేమశాఖపై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలు, సంక్షేమ పథకాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని, అర్హత కలిగిన యువతకు మాత్రమే ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.






కామెంట్‌లు (0)