నవతెలంగాణ - హైదరాబాద్ : ఎన్నికల సంఘం వివాదంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకానుంది. మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాహుల్, ప్రియాంక, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. కాగా ఎన్నికల సంఘం వివాదంపై మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)