నవతెలంగాణ - హైదరాబాద్ : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పులపాలైన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శేషాద్రి (32), అంజిత (27) ఆరేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. బెట్టింగ్ కారణంగా అప్పులు పెరగడంతో వాటిని తీర్చలేక ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంజిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపారు.
భార్యాభర్తల ప్రాణాలు తీసీన ఆన్‌లైన్ బెట్టింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)