నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిమ్స్ అస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నూరి లక్ష్మీ భాస్కర్ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఉదయం నిమ్స్‌లోని పలువురు ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన డాక్టర్ భాస్కర్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
నిమ్స్ ఉద్యోగుల ఇండ్లలో ఏసీబీ తనిఖీలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)