నవతెలంగాణ - హైదరాబాద్ : బంగారం ధరల పతనం కొనసాగుతున్నది. సోమవారం కొంతమేరకు తగ్గిన పసిడి ధరలు మంగళవారం కూడా అదేబాటలో పయనించాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై సుమారు రూ.2,500 వరకు తగ్గింది. దాంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ భయాలు.. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు ఆకర్షణీయంగా మారడం వంటి అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.






కామెంట్‌లు (0)