నవతెలంగాణ - హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్డులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాలతో వైద్య మోహన్(40) అనే వ్యక్తిని అతడి భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మంచిర్యాల పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
రోకలిబండతో భర్తను హత్య చేసిన భార్య
46 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)