నవతెలంగాణ–హైదరాబాద్: సోషల్ మీడియాలో రీల్స్ చూసి నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులు అరెస్టు చేశారు. కూరగాయల వ్యాపారి కిషన్ సోలంకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసిన తర్వాత టెలిగ్రామ్ ద్వారా శిక్షణ పొంది నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజ్‌కోట్ సిటీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు కిషన్ నివాసంలో సోదాలు నిర్వహించి రూ.65,500 విలువైన నకిలీ కరెన్సీతో పాటు ముద్రణ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మండదుంగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో రూ.100, రూ.500 నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.







కామెంట్‌లు (0)