నవతెలంగాణ-నెల్లికుదురు
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్& వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం అనేక డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఎంపీడీవో కుమార్ కి అందజేసినట్లు సిఐటియు మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈ వినతి పత్రాన్ని అందించామని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, రెండవ పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం ఎల్లయ్య, మండల కార్యదర్శి బి వెంకన్న ,మండల్ ఉపాధ్యక్షుడు ఎల్తూరి కృష్ణ ,వెంకన్న, రామకోటి, రంగాల వెంకన్న, హెచ్ వెంకటమ్మ ,ధర్మారపు శ్రావణి, రామకోటి జే యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



