Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదేళ్లుగా పనులు చేయకుండా జీతాలు తీసుకుంటున్న హాస్టల్ వర్కర్లు

ఐదేళ్లుగా పనులు చేయకుండా జీతాలు తీసుకుంటున్న హాస్టల్ వర్కర్లు

- Advertisement -

 ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఇస్తున్న అధికారిపై చర్య తీసుకోవాలి
నవతెలంగాణ-అచ్చంపేట

నాగర్ కర్నూల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలో నిర్వహిస్తున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో గత ఐదేళ్లుగా 10 మంది అవుట్సోర్సింగ్ వర్కర్లు పనులు చేయకుండా ప్రతినెల వేతనాలు తీసుకుంటున్నారని, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెల వేతనాలు ఇస్తున్న అధికారిపై విచారణ చేసి చర్య తీసుకోవాలని అచ్చంపేట పట్టణానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి గత నెల 18.న  జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కు  ఫిర్యాదు చేశారు. 

1.విశ్వేశ్వర్ కొల్లాపూర్ హాస్టల్, 2. మమత, సుజాత బాలికల అచ్చంపేట, 3 సునీత డి హాస్టల్ నాగర్ కర్నూల్, 4 విశాలాక్షి రఘుపతిపేట హాస్టల్, 5 వీణ రాతి పెద్దకొత్తపల్లి, 6 లక్ష్మి బాలికల హాస్టల్ కల్వకుర్తి, 7 ఎలిజబెత్ , చిత్తరంజన్ బిజినపల్లి, 8 హాస్టల్,  రాధ బాలికల బాలికల హాస్టల్ అమ్రాబాద్, 10.మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెల వేతనాలు చెల్లిస్తూ కొందరు అధికారులు సహకరిస్తున్నారని, అవినీతికి పాల్పడుతూ జీతాలు తీసుకున్న వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -